సాహో పై భారీ కుట్ర‌కు ప్లాన్‌..!

1232

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ సాహూపై భారీ కుట్ర జరగనుందా ? తెలుగు సినిమాలు ప్రపంచ స్థాయి అందుకోవటానికి జీర్ణించుకోలేని బాలీవుడ్‌లో ఓ వర్గంతో పాటు నార్త్ ఇండియన్ మీడియా సాహోపై కుట్రకు తెర లేపిందా ? సాహో టార్గెట్గా ఏం ? జరుగుతోంది అన్న దానిపై ఇప్పుడు నార్త్ ఇండియన్ మీడియా సర్కిల్స్ లో ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. సహజంగానే సౌత్ నుంచి వచ్చే సినిమాలంటే బాలీవుడ్ వాళ్లు నిన్న మొన్న‌టి వ‌ర‌కు చులకనగా చూసేవారు. అంతెందుకు సౌత్ లో కూడా బాలీవుడ్ కంటే తామే గొప్ప వాళ్ళం అన్న‌ ఫీలింగ్ కోలీవుడ్ వాళ్ల‌కు ఉండేది.

Mumbai Media Negative For Saaho Movie

బాహుబలి వచ్చాక సీన్ మొత్తం మారిపోయింది. బాలీవుడ్లో త‌ల‌లు పండిన ఖాన్లు, ఇంకా సూప‌ర్‌స్టార్‌లు అని చెప్పుకునే వాళ్ల‌కు గింగ‌రాలు తిరిగేలా ఆ సినిమా వ‌సూళ్లు రాబ‌ట్టింది. బాలీవుడ్ బ‌డా హీరోల‌కే సాధ్యం కాని విధంగా బాహుబ‌లి మంచి నీళ్లు తాగినంత సులువుగా రికార్డులు బ‌ద్ద‌లు కొట్టేసింది. ఇప్పుడు సాహో కూడా హిట్ అయితే ఇక ఇండియ‌న్ సినిమా ల‌వ‌ర్స్ దృష్టంతా తెలుగు సినిమాల మీదే ఉంటుంది.

ఇదే ఇప్పుడు బాలీవుడ్ సినీవ‌ర్గాల‌తో పాటు నార్త్ ఇండియ‌న్ మీడియాను కుళ్లు కునేలా చేస్తోంది. అందుకే ఇప్పుడు వాళ్లంతా క‌లిసి సాహోను టార్గెట్ చేసేందుకు కుట్ర ప‌న్నారన్న టాక్ అయితే బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. అంతెందుకు ఇటీవ‌ల తెలుగు ద‌ర్శ‌కుడు సందీప్‌రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన క‌బీర్‌సింగ్ ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా, అక్క‌డ వాళ్లు ఎంత కుళ్లుకున్నా ఏకంగా రూ.290 కోట్ల షేర్ రాబ‌ట్టింది.

ఇక ఇప్పుడు సాహోకు టాక్ నెగిటివ్‌గా స్ప్రెడ్ చేసేందుకు ముంబై మీడియా స్పెషల్ గా టార్గెట్ చేసినట్టు వినికిడి. సాహోలో చాలా మంది హిందీ వాళ్లు ఉన్నా… ఈ సినిమాను తీసింది… న‌టించింది, హీరో అంతా తెలుగు వాళ్లే. అందుకే సినిమా సూప‌ర్ హిట్ అయితే ఆ పేరంతా తెలుగువాళ్ల‌కే ద‌క్కుతుంది. అందేకే రిలీజ్ రోజు ముంబై మీడియాతో పాటు సోష‌ల్ మీడియాలో బాగా టార్గెట్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌.

ఇక్క‌డే వాళ్లు గుర్తుపెట్టుకోవాల్సింది కూడా ఒకటుంది. వాళ్లు ఎంత నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేద్దామ‌నుకున్నా ఎలాగూ కంటెంట్ మాట్లాడుతుంది కాబట్టి వాళ్లు ఏం చేసుకున్నా ఇబ్బంది ఉండ‌దు. ఇప్పుడు సాహో కంటెంట్ దుమ్ము చూపించ‌డం ఒక్క‌టే మిగిలి ఉంది.