గుడ్లు తినాలా? వద్దా? గుడ్లపై వస్తున్న విమర్శలు నిజమా అబద్ధమా…?

-

గుడ్డులో 185 మిల్లీ గ్రాముల కొవ్వు ఉంటుందట. అంటే ఒక గుడ్డు మనం తిన్నామంటే…   ఎక్కువ శాతం కొవ్వు లభించినట్టే. కొవ్వు 300 మిల్లీ గ్రాములు మించితే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని ఆ అధ్యయనం చెబుతోంది.

గుడ్డు… రోజూ ఓ గుడ్డు తినండి.. డాక్టర్ కు దూరంగా ఉండండి అని చాలామంది చెబుతుంటారు. డాక్టర్లు కూడా గుడ్లు ఎక్కువగా తినాలని చెబుతుంటారు. అవును… గర్భిణీలకు, పిల్లలకు కూడా ఎక్కవగా గుడ్లు తినాలనే చెబుతుంటారు. గుడ్డు పౌష్టికాహామని.. అందులో ఉండే ప్రొటీన్స్ ఏ ఆహార పదార్థంలో కూడా ఉండవంటారు. రోజుకు ఒక గుడ్డు అయినా తినొచ్చు ఏం కాదు అని చెబుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా గుడ్ల మీద ఎన్నో విమర్శలు వస్తున్నాయి. గుడ్లు ఆరోగ్యానికి ప్రమాదకరమని.. గుడ్లు తింటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని వార్తలు వస్తున్నాయి. మరి.. దీంట్లో వాస్తవమెంత?

Is egg good for health or bad what researchers are saying

సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేయడానికి కారణం జామా మెడికల్ జర్నల్ లో అచ్చయిన ఓ అధ్యయనం. అవును.. ఆ అధ్యయనం ఏం చెబుతోందంటే… గుడ్డులో పచ్చ సొన ఉంటుంది కదా.. ఆ పచ్చ సొనలో కొవ్వు ఎక్కువగా ఉంటుందట. మామూలుగా మనం తినే ఆహారంలో కొవ్వు శాతం రోజుకు 300 మిల్లీ గ్రాములు మించకూడదట.

కానీ.. గుడ్డులో 185 మిల్లీ గ్రాముల కొవ్వు ఉంటుందట. అంటే ఒక గుడ్డు మనం తిన్నామంటే… సగంపైక కొవ్వు లభించినట్టే. కొవ్వు 300 మిల్లీ గ్రాములు మించితే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని ఆ అధ్యయనం చెబుతోంది.

వాళ్ల అధ్యయనం ప్రకారం… రోజుకు 300 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువ కొవ్వు పదార్థాలను తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం 17 శాతం పెరిగితే.. సడెన్ డెత్ వచ్చే ప్రమాదం 18 శాతం పెరుగుతుందట. వారానికి నాలుగు గుడ్లు తిన్నవాళ్లకు గుండెజబ్బులు వచ్చే ప్రమాదం 6, అకాల మరణం సంభవించే అవకాశం 8 శాతం పెరిగితే… రోజుకు రెండు గుడ్లు తినే వాళ్లకు ఈ శాతం పెరుగుతుందట. 27 శాతం గుండె జబ్బులు వచ్చే అవకాశం, 34 వాతం అకాల మరణం సంభవించే ప్రమాదం ఉంటుందట.

మరి వారానికి ఎన్ని గుడ్లు తినాలి

ఆ అధ్యయనం ప్రకారం వారానికి మూడు గుడ్ల కంటే ఎక్కువ తినకూడదట. మీకు గుడ్లు లేనిదే ముద్ద దిగదనుకోండి… గుడ్డులోని తెల్లసొనను మాత్రమే తినండి. అయితే.. ఇది అందరికీ వర్తించదట. ఒక్కొక్కరి శరీరతత్వం ఒక్కోలా ఉంటుందని.. కొందరు వ్యాయామాలు అవీ ఇవీ చేసి తమలోని కొవ్వును కరిగించుకుంటారని.. కొందరు ఏపనీ చేయకుండా ఉండటం వల్ల కొవ్వు పేరుకుపోయి లేని పోని సమస్యలు వస్తాయని.. శరీరానికి ఏమాత్రం అలసట కలిగించని వాళ్లకే ఎక్కువగా ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని ఆ అధ్యయనం చెబుతోంది. అది.. ఫ్రెండ్స్.. అర్థమయింది కదా. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మకండి. ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలుసుకొండి.

Read more RELATED
Recommended to you

Latest news