ఎప్పుడూ లేనిది  హీరో వెంకటేష్ ని విపరీతంగా ట్రాల్ చేస్తున్నారు !

517

టాలీవుడ్ సీనియర్ హీరోలలో విక్టరీ వెంకటేష్ కుర్ర హీరోల కంటే సినిమాలు చేయడంలో చాలా ఫాస్ట్ గా ఉన్నారు. F2, వెంకీ మామ సినిమాలతో గత ఏడాది టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన వెంకటేష్ తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వెట్రి మారన్ కాంబినేషన్లో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘అసురన్’ సినిమాని తెలుగులో ‘‘నారప్ప’’ అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు.

Image result for naarappa

సురేష్ ప్రొడక్షన్ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా క్లాసికల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రమంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ సోషల్ మీడియా లో రిలీజ్ చేశారు. వెంకటేష్ నటిస్తున్న 74వ సినిమా ఇది. వెంకీ గెటప్, బాడీ లాంగ్వేజ్ ఆకట్టుకునేలా ఉన్నాయి. కాగా ఫస్ట్ లుక్ పేరిట విడుదల చేసిన పోస్టర్స్ చూసిన నెటిజన్లు తమిళవాళ్లు అసురన్ తో కంపరే చేసి లూక్స్ బలేదు అంటున్నారు ట్రాల్ చేస్తున్నారు. చాలా మంది నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ మధ్య ఏ సినిమా హీరోని చేయని విధంగా ‘‘నారప్ప’’ లుక్ విషయంలో వెంకీ గెటప్ పై ఆసక్తికరమైన కామెంట్స్ వినబడుతున్నాయి. కొంతమంది అయితే భూతవైద్యుడులా, చేతబడులు చేసుకునే వాడిలా వెంకటేష్ గెటప్ ఉందని కామెంట్ చేస్తున్నారు.