జక్కన్నా మజాకా.. ఆస్కార్ వేదికపై మరోసారి ‘నాటునాటు’

-

అమెరికా లాస్ ఏంజిల్స్లోని డాల్బీ థియేటర్‌లో 96వ ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. ఈ అవార్డుల వేడుకకు ప్రపంచంలోని వివిధ దేశాల నటీనటులు, సెలబ్రిటీలు హాజరయ్యారు. ఆయా కేటగిరీల్లో పలు హాలీవుడ్ సినిమాలు, నటులు, సాంకేతిక నిపుణులు పురస్కారాలు అందుకున్నారు. గతేడాది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు అందుకున్న ‘నాటు నాటు’ పాట తాజాగా మరోసారి అస్కార్ వేదికపై కనిపించింది.

ఈ కార్యక్రమంలో భాగంగా బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో ‘వాట్‌ వాజ్‌ ఐ మేడ్‌ ఫర్‌?’ (What Was I Made For?)పాటకు ఆస్కార్ అవార్డు దక్కింది. ఈ అవార్డు ప్రజెంటేషన్ సమయంలో స్టేజ్ బ్యాక్గ్రౌండ్లో ‘నాటు నాటు’ పాటతో పాటు విజువల్స్ ప్లే చేశారు.

మరోవైపు సినిమా కోసం రిస్క్ చేస్తూ స్టంట్స్ చేసే మాస్టర్ల కోసం కూడా ఓ వీడియో ప్లే చేశారు. ఇందులో హాలీవుడ్ సినిమాల్లోని కొన్ని స్టంట్ సీన్స్తో పాటు ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన ఓ ఫైట్ సీన్ కూడా ఉంది. ఈ వీడియోలను ఆర్ఆర్ఆర్ సినిమా అధికారిక ఎక్స్ పేజ్లో షేర్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news