Nabha Naresh : స్టైలిష్ లుక్ లో ఇస్మార్ట్ బ్యూటీ.. పోజులు అదుర్స్

-

ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేశ్ గురించి తెలియని వారుండరు. నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన నభా తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ క్రేజ్ దక్కించుకుంది. ఆ మూవీ తర్వాత ఇక ఈ భామకు తెగ అవకాశాలు వస్తాయని అంతా భావించినా అలా జరగలేదు. అడపాదడపా ఛాన్సులతో వెండితెరపై సందడి చేస్తోంది.

కానీ సోషల్ మీడియాలో మాత్రం నభా యమా యాక్టివ్. ఈ భామ తరచూ ఫొటో షూట్స్ తో తన అభిమానులను మైమరిపిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ సూపర్ క్లాసీ లుక్ ఫొటోలకు పోజులిచ్చింది. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. యాష్ కలర్ సూటులో నభా అందాల జాతర అదరగొట్టేసింది. స్టైలిష్ లుక్ లో మెస్మరైజింగ్ పోజులతో కవ్వించింది. ఈ ఫొటోలు చూసి కుర్రకారు నభాపై మరోసారి మనసు పారేసుకున్నారు. హార్ట్, స్మైల్ ఎమోజీలతో కామెంట్ బాక్సులు నింపేశారు.

Read more RELATED
Recommended to you

Latest news