న‌భా న‌టేష్ లో ఈ క‌ళ కూడా వుందా?

-

క‌న్న‌డ హీయిన్ న‌భా న‌టేష్ త‌న కొత్త క‌ళ‌తో స‌ర్‌ప్రైజ్ చేసింది. త‌న‌లో న‌ట‌నే కాదు అంత‌కు మించిన టాలెంట్ వుంద‌ని నిరూపించింది. హాలీవుడ్ ఫిక్ష‌న్ క్యారెక్ట‌ర్ సూప‌ర్ హీరో బ్యాట్మెన్ పెయింటింగ్‌ని వేసి త‌నలో వున్న సృజ‌నాత్మ‌క‌త‌ను బ‌య‌ట‌పెట్టింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆ పెయింటింగ్‌ని అభిమానుల‌తో పంచుకుంది.

బ్యాట‌మెన్ పెయింటింగ్‌ని పోస్ట్ చేసిన న‌భా `బ్రూస్ వేన్‌కు ఇదొక నివాళి. దీన్ని చేయ‌డానికి 6 నుంచి ఏడు సెక‌న్ల స‌మ‌యాన్ని తీసుకున్నాను. ఈ పెయింటిగ్ వేస్తున్న క్ర‌మాన్ని చాలా ఎంజాయ్ చేశాను. మీరే చూడండి. బ్యాట్మెన్ అభిమానులైతే నా ప‌నికి గ‌ర్విస్తున్నార‌నుకుంటున్నాను` అని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. `న‌న్నుదోచుకుందువ‌టే` చిత్రంతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన న‌భా `ఇస్మార్ట్ శంక‌ర్‌`తో హీరోయిన్ గా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం న‌భా న‌టేష్ చేతిలో `సోలో బ్ర‌తుకే సోబెట‌ర్‌, అల్లుడు అదుర్స్ చిత్రాలున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news