రామ్ హీరోయిన్ ప్రేమ‌లో మెగా హీరో

-

కేవలం మూడు సినిమాలతో బెంగళూరు నటి నభా నటేష్ టాలీవుడ్‌లో తన ఉనికిని చాటుకుంది. అంత‌కు ముందు ఆమె చేసిన సినిమాల‌కు రాని క్రేజ్ ఒక్క ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో వ‌చ్చేసింది. పూరి జ‌గ‌న్నాథ్ – రామ్ కాంబోలో వ‌చ్చిన ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాలో ఆమె హాట్ హాట్ యాక్టింగ్‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయిపోయారు. ఈ సినిమాలో ఆమె న‌ట‌న‌తో టాలీవుడ్ యంగ్ హీరోల‌తో పాటు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు కూడా ఆమెకు త‌మ సినిమాల్లో ఛాన్సులు ఇచ్చేందుకు వెంట‌ప‌డుతున్నారు.

ప్ర‌స్తుతం ఆమె మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ డిస్కోరాజా సినిమాలో న‌టిస్తోంది. తాజాగా టాలీవుడ్‌లో మరో చిత్రానికి నాభా సంతకం చేసినట్లు స‌మాచారం. సీనియర్‌ ప్రొడ్యూసర్ బీవిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో యంగ్‌ మెగా హీరో సాయి ధరం తేజ్‌ సరసన ఆమె ప్రధాన పాత్రలో నటించనుంది. ఈ చిత్రం రెగ్యులర్ షూట్ అక్టోబర్ నుండి ప్రారంభమవుతుంది.

nabha-natesh-to-romance-with-mega-hero
nabha-natesh-to-romance-with-mega-hero

ఈ సినిమా ల‌వ్‌స్టోరీ నేప‌థ్యంలో న‌డుస్తుంద‌ట‌. సాయి ధ‌ర‌మ్ – న‌బా న‌టేష్ మ‌ధ్య వ‌చ్చే ప్రేమ స‌న్నివేశాలు బ్యూటిఫుల్‌గా ఉంటాయంటున్నారు. ఈ సినిమా క‌థాంశాన్ని బ‌ట్టి చూస్తే తొలిప్రేమ టైప్‌లో చాలా హార్ట్‌ట‌చ్చింగ్‌గా ఉంటుంద‌ని తెలుస్తోంది. మ‌రి సాయి – న‌బాల ఆన్‌స్క్రీన్ ప్రేమ వ్య‌వ‌హారం ప్రేక్ష‌కుల‌ను ఎంత వ‌ర‌కు మెప్పిస్తుందో ? చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news