నాగచైతన్య తొలి వెబ్‌ సిరీస్‌ ‘ధూత’ స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్

-

ఇప్పుడంతా డిజిటల్ మీడియాదే ట్రెండు. సినిమాల్లో ఓటీటీలదే హవా నడుస్తోంది. అందుకే ఎంత పెద్ద హీరోలయినా.. తమ కెరీర్​లో ఎన్ని బ్లాక్​బస్టర్ హిట్స్ ఉన్నా.. బడా హీరోలు కూడా డిజిటల్ సినిమావైపు చూస్తున్నారు. ఇందులో భాగంగా విక్టరీ వెంకటేశ్, రానా వంటి ప్రముఖ హీరోలు ఇప్పటికే ఓటీటీలో ఎంట్రీ ఇచ్చి తమ సత్తా చాటుకున్నారు. ఇప్పుడు వారి బాటలోనే వారి కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.

అక్కినేని నాగచైతన్య ఓటీటీ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. చై నటించిన తొలి వెబ్ సిరీస్ ధూత త్వరలోనే విడుదల కానుంది. సూపర్‌ నేచురల్‌ హారర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌ను విక్రమ్‌ కె.కుమార్‌ తెరకెక్కించాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్.. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా డిసెంబర్‌ 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఎనిమిది ఎపిసోడ్స్‌తో తీర్చిదిద్దిన ఈ సిరీస్​లో.. సాగర్‌ అనే జర్నలిస్ట్‌ పాత్రలో చైతన్య నటిస్తున్నాడు. ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్​గా నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news