నాగ్​కు బర్త్​డే విషెస్ తెలుపుతూ నాగ చైతన్య సినిమా పోస్టర్ విడుదల..!

-

నాగ చైతన్య-విక్రమ్ కుమార్​ల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటివరకు వీరి నుంచి స్పందన రాలేదు. అయితే తాజాగా ఈరోజు నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. నాగ్​కు బర్త్​డే విషెస్ తెలుపుతూ టైటిల్​ వెల్లడించారు.ఈ సినిమాకు ‘థ్యాంక్యూ’ అనే టైటిల్ పెట్టారు. దిల్​రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు. హీరోయిన్​తో పాటు మిగిలిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.ప్రస్తుత శేఖర్ కమ్ముల-నాగచైతన్య కాంబినేషన్​లో వస్తోన్న ‘లవ్​స్టోరీ’ చిత్రం తుదిదశకు చేరుకుంది. ఈ సినిమా తర్వాత విక్రమ్​తో చిత్రాన్ని ప్రారంభించనున్నాడు చైతూ.

మాస్‌ కథానాయకుడు అనే మాటకు అసలు సిసలు నిర్వచనం నాగార్జున. ‘శివ’ అంటూ సైకిల్‌ చైన్‌ పట్టి యువతరాన్ని అలరించిన ఆయనే… ‘అల్లరి అల్లుడు’గా కుటుంబ కథల్లోనూ ఒదిగిపోయారు. ‘మన్మథుడు’గా మగువల మనసునూ దోచారు. ఆ తర్వాత ‘అన్నమయ్య’ అంటూ భక్తిభావాన్నీ పండించారు. నటుడిగా ఎన్నో ప్రయోగాలు చేసిన నాగార్జున నేడు (ఆగస్టు 29) 61వ ఒడిలోకి అడుగుపెడుతున్నారు

Read more RELATED
Recommended to you

Latest news