సంచలనంగా నూతన్ నాయుడు ఇంటి విజువల్స్.. గుండు కొట్టించింది ఆడవాళ్లే !

-

విశాఖలోని పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని సుజాత నగర్ లో నివాసముంటున్న శ్రీకాంత్ అనే దళిత యువకుడికి సినీ నిర్మాత నూతన్ నాయుడు ఇంట్లో గుండు కొట్టించి తీవ్రంగా అవమానపరిచిన ఘటన చోటు చేసుకుంది. దళిత యువకుడు నూతన్ నాయుడు ఇంట్లో గత నాలుగు నెలలుగా పనిచేస్తూ ఈ నెల ఒకటో తారీఖు నుండి పని మానేశాడు. అదే కోపాన్ని దృష్టిలో పెట్టుకొని సెల్ ఫోన్ పోయింది దాని కోసం మాట్లాడదాం ఇంటికి రమ్మని చెప్పి నూతన్ నాయుడు సిబ్బంది నూతన్ నాయుడు భార్య చూస్తుండగా శ్రీకాంత్ కు గుండు గీయించారు.

ఈ విషయాన్ని బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని భయపెట్టి ఇక్కడ నుంచి పంపించేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. బాధితుడు శ్రీకాంత్ నుండి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇక సీసీ టీవీ విజువల్స్ చూసి ఈ శిరోముండనం కేసులో ఏడుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. నూతన్ నాయుడు ఇంట్లో పనిచేసే సిబ్బందిపై పలు సెక్షన్‌ల కింద కేసు రిజిస్టర్ చేశారు. మధుప్రియ, ఇందిరా, ఝాన్సీ, సౌజన్య, రవి, బాలు, వరహాలుపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు పెట్టారు. అయితే వీరిలో నలుగురూ ఆడవాళ్లే కావడం వాళ్ళే దగ్గరుండి గుండు చేయించడం సంచలనంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news