చైతు, సమంతల మజిలీ టీజర్..!

-

ఏమాయ చేసావె సినిమాలో కలిసి నటించిన నాగ చైతన్య, సమంత ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా ప్రేమికులుగా మారి జీవితాన్ని పంచుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాల్లో బిజీగా మారిన చైతన్య, సమంత మరోసారి ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా మజిలి. నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న ఈ మజిలీ టీజర్ రిలీజైంది. క్రికెటర్ అవ్వాలనుకున్న హీరో.. తండ్రి 1 ఇయర్ టైం పెట్టడంతో ఆ వన్ ఇయర్ లో అతను ఏం చేశాడు.

ప్రేమించిన అమ్మాయికి దూరమై వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న హీరో తన మీద ఇష్టం లేకున్నా భర్త మీద ప్రేమ చూపించే భార్య పాత్రలో సమంత. ఇలా సినిమాలో కావాల్సినన్ని ఎమోషన్స్ పెట్టాడు దర్శకుడు శివ నిర్వాణ. టీజర్ ఇంప్రెస్ చేయగా సినిమా కూడా మళ్లీ నిన్ను కోరిలానే మంచి ఫలితాన్ని అందుకుంటుందని అనిపిస్తుంది. పెళ్లి తర్వాత చైతు, సమంతలు చేస్తున్న ఈ సినిమాపై అక్కినేని ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news