ప్రధాని మోదీకి గుజరాత్‌లో మామూలు ఫాలోయింగ్ ఉంటదా? అసలే ఆయన గుజరాత్‌కు చెందిన వారు. గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. గుజరాత్ అభివృద్ధి చెందింది అంటూ దాంట్లో మోదీ పాత్ర చాలా ఉంది. అందుకే.. గుజరాతీలు మోదీపై అభిమానం చూపిస్తారు. ఆయనపై అభిమానాన్ని ఇదిగో ఇలా చూపిస్తారు. టీషర్టుల మీద ఆయన ఫోటోను ముద్రించడం.. కీ చైన్లలో మోదీ ఫోటోను పెట్టుకోవడం.. చివరకు వెడ్డింగ్ కార్డులలో కూడా మోదీ ఫోటోలను ప్రింట్ చేయించేవారు. అయితే.. అదంతా పాత ట్రెండ్.. ఇప్పుడు ఆ క్రేజ్ ఎక్కడిదాకా వెళ్లిందో తెలుసా? ఏకంగా చీరల మీద కూడా మోదీ ఫోటోను ప్రింట్ చేయిస్తున్నారు.
ఇక.. మోదీ ఫోటోలతో వచ్చిన చీరలు మార్కెట్‌లోకి వచ్చాయో లేదో.. వాటిని మహిళలు ఎగబడి మరీ కొంటున్నారట. సూరత్‌లో మోదీ చిత్రాన్ని ముద్రించిన చీరలు వచ్చాయి. రకరకాల డిజైన్లు, ప్రింట్లతో మోదీ చీరలు మహిళలను ఆకట్టుకుంటున్నాయట. ఈ ఆలోచన ఎవరు చేశారో కానీ.. సూపర్బ్.. ఇటు గిరాకీకి గిరాకీ.. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి కూడా ఈ మోదీ చీరలు ఏవో కలిసి వచ్చేట్టే ఉన్నాయి.