అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా శివ నిర్వాణ డైరక్షన్ లో వచ్చిన సినిమా మజిలీ. ఉగాది కానుకగా ఓ రోజు ముందే ప్రేక్క్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా చైతు కెరియర్ లో బిగ్గెస్ట్ దిశగా పరుగులు తీస్తుంది. మొదటిరోజు 5 కోట్లకు అటు ఇటుగా వసూళ్లు రాబట్టిన మజిలీ సినిమా రెండో రోజు సత్తా చాటింది. రెండు రోజుల కలక్షన్స్ కలిపి కేవలం తెలుగు రెండు రాష్ట్రాల్లోనే 9.51 కోట్ల దాకా వచ్చాయని తెలుస్తుంది.
పూర్ణ, శ్రావణి పాత్రల్లో చైతు, సమంత అదరగొట్టారు. 21 కోట్ల ప్రీ రిలీజ్ ఈవెంట్ తో రిలీజ్ అయిన ఈ మజిలీ సినిమా సక్సెస్ చైతుకి మంచి ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. ఇక ఏరియాలవారిగా మజిలీ కలక్షన్స్ వివరాలు చూస్తే..