సవ్యసాచి సెన్సార్ పూర్తి..!

-

నాగ చైతన్య, నిధి అగర్వాల్ జంటగా చందు మొండేటి డైరక్షన్ లో వస్తున్న సినిమా సవ్యసాచి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ ఆడియెన్స్ ను మెప్పించింది. ప్రయోగాత్మకంగా వస్తున్న ఈ సినిమా నవంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మాధవన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో భూమిక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈరోజు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా యు/ఏ సర్టిఫికెట్ అందుకుంది.

సెన్సార్ సభ్యుల నుండి కూడా ఈ సినిమా ప్రశంసలు అందుకున్నట్టు తెలుస్తుంది. రీసెంట్ గా శైలజా రెడ్డి అల్లుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ చైతన్య ఆ సినిమాతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. రాబోతున్న సవ్యసాచి మూవీతో అయినా హిట్ కొడతాడేమో చూడాలి. కీరవాణి అందించిన మ్యూజిక్ సవ్యసాచి మూవీకి స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. సినిమా కోసం నిన్న రోడ్డు మీద చూసినది లగ్గాయిత్తు సాంగ్ రీమిక్స్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version