సవ్యసాచి ట్రైలర్.. చైతు కొత్త ప్రయోగం..!

-

ప్రేమమ్ సినిమాతో చందు మొండేటి టాలెంట్ గుర్తించిన నాగ చైతన్య అతనితో సవ్యసాచి సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా నవంబర్ 2న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. సుకుమార్ గెస్ట్ గా వచ్చిన ఈ కార్యక్రమంలో సవ్యసాచి కథ తెలుసన్న సుకుమార్ చైతుని చూస్తుంటే ఈర్ష్యగా ఉందని సరదాగా అన్నారు.

ఇక ఈ సినిమా ట్రైలర్ చూస్తే.. ఎడమ చేయి తన ఆదీనంలో లేకపోవడం వల్ల హీరో ఎలా దాన్ని మ్యానేజ్ చేశాడు. హాయిగా సాగిపోతున్న తన కుటుంబంలో అనుకోని విలన్ ఎంట్రీ ఇస్తే వారి నుండి తన ఫ్యామిలీని హీరో ఎలా కాపాడాడు అన్నది సినిమా కథ. ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది.

నాగ చైతన్య చేస్తున్న ఈ సరికొత్త ప్రయత్నానికి ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. చైతు సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news