అల్లుడు లెట్స్ డూ కుమ్ముడు

-

అక్కినేని నాగ చైతన్య హీరోగా వినాయక చవితి నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా శైలజా రెడ్డి అల్లుడు. మారుతి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో అను ఎమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగ వంశీ నిర్మించిన ఈ సినిమాలో శివగామి రమ్యకృష్ణ టైటిల్ రోల్ పోశించింది.

ఇక ఈ సినిమా రిలీజైన మొదటి రోజు మిక్సెడ్ టాక్ సాధించగా కలక్షన్స్ మాత్రం కుమ్మేసింది. ఫస్ట్ డే చైతు కెరియర్ లో ఎన్నడు లేని విధంగా 7.50 కోట్ల దాకా షేర్ రాబట్టిన శైలజా రెడ్డి అల్లుడు సినిమా రిలీజ్ అయ్యి ఈరోజుకి వారం అవుతుంది. ఈ వారం రోజుల్లో ఈ సినిమా 16.14 కోట్ల షేర్ రాబట్టింది. మరుతి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా థియేట్రిక్ రైట్స్ పాతిక కోట్లకే రిలీజ్ ముందే ఇచ్చేశారు. ప్రస్తుతం 65 శాతం రికవెరీ అయినా ఫుల్ రన్ లో అల్లుడు సేఫ్ ప్రాజెక్ట్ అనిపించుకుంటాడని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

ఏరియాల వారిగా శైఅలజా రెడ్డి అల్లుడు కలక్షన్స్ :

నైజాం – 3.90 కోట్లు

సీడెడ్ – 2.45 కోట్లు

ఉత్తరాంధ్ర – 1.53 కోట్లు

గుంటూరు – 1.23 కోట్లు

కృష్ణా – 0.93 కోట్లు

నెల్లూరు – 0.56 కోట్లు

ఈస్ట్ – 1.38 కోట్లు

వెస్ట్ – 0.86 కోట్లు

ఏపి/ టెలంగాణా – 12.84

రెస్ట్ ఆఫ్ ఇండియా – 1.75 కోట్లు

ఓవర్సీస్ – 1.55 కోట్లు

వరల్డ్ వైడ్ టోటల్ కలక్షన్స్ – 16.14 కోట్లు

Read more RELATED
Recommended to you

Exit mobile version