మజిలీ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అక్కినేని నాగ చైతన్య ఫిదా బ్యూటి సాయి పల్లవి నటిస్తున్న తాజా చిత్రం ” లవ్ స్టోరి “. క్లాస్ చిత్రాలతో హిట్స్ అందుకుంటున్న శేఖర్ కమ్ముల ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పూర్తయిందని సమాచారం. అయితే లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియడం లేదు. ఇక ఇప్పటి వరకు సినిమా మీద పాజిటివ్ టాక్ ఉండటం విశేషం. లవ్ స్టోరీ అన్న టైటిల్ తోనే సగం హిట్ తెచ్చుకున్న ఈ సినిమా పోస్టర్స్, టీజర్ తో అది ఇంకా బలపడింది. మొత్తం యూనిట్ ఈ సినిమా హిట్ అన్న ధీమాలో ఉన్నారు.
ఇక ఈ సినిమా తర్వాత నాగ చైతన్య సోగ్గాడే చిన్ని నాయన కి సీక్వెల్ గా బంగార్రాజు లో నటిస్తాడన్న టాక్ నడిచింది. అలాగే గీత గోవిందం ఫేం పరశురాం దర్శకత్వంలో నటిస్తాడన్న వార్తలు వచ్చాయి. అయితే ఎట్టకేలకు చైతు నటించే సినిమా కన్‌ఫర్మ్ అయిందని తాజా సమాచారం. అక్కినేని ఫ్యామిలీకి మనం వంటి గొప్ప చిత్రాన్ని ఇచ్చిన విక్రం కె కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య తర్వాత సినిమా ఉండబోతుందట.
గత కొంతకాలంగా విక్రం కుమార్ హిట్స్ లేక ఇబ్బంది పడుతున్నాడు. అయినా కూడా నాగ చైతన్య దర్శకుడి మీద ఉన్న నమ్మకంతో ప్రాజెక్ట్ కమిటయినట్టు తెలుస్తుంది. మజిలీ..లవ్ స్టోరీ తరహాలోనే ఈ సినిమా కంప్లీట్ రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ గా రూపొందుతుందని లేటెస్ట్ న్యూస్. మరి సక్సస్ కోసం ఎదురు చూస్తున్న ఈ దర్శకుడుకి నాగ చైతన్య అవకాశం ఇచ్చాడంటే ఖచ్చితంగా కథ లో మంచి కంటెంట్ ఉందనిపిస్తుంది. ఇక ఈ ప్రాజెక్ట్ కి సంబంధిన ఇతర విషయాలు త్వరలో అధికారకంగా ప్రకటిస్తారట.