ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్.. గెలాక్సీ ట్యాబ్ ఎస్6 లైట్ పేరిట ఓ నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో 10.4 ఇంచుల టీఎఫ్‌టీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆక్టాకోర్ ఎగ్జినోస్ 9611 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 1టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌లను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 10 ఆధారంగా ఈ ట్యాబ్ పనిచేస్తుంది. ఇందులో వెనుక భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరా, ముందు భాగంలో 5 మెగాపిక్సల్ కెమెరాలను ఏర్పాటు చేశారు. డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 4జీ ఎల్‌టీఈ, 7040 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఇతర ఫీచర్లను కూడా ఇందులో అందిస్తున్నారు.
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్6 లైట్ స్పెసిఫికేషన్లు…
* 10.1 ఇంచుల టీఎఫ్‌టీ డిస్‌ప్లే, 2000 x 1200 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* ఆక్టాకోర్ ఎగ్జినోస్ 9611 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్
* 1 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 10
* 8, 5 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు
* 4జీ ఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0
* యూఎస్‌బీ టైప్ సి, 7040 ఎంఏహెచ్ బ్యాటరీ
గెలాక్సీ ట్యాబ్ ఎస్6 లైట్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ ఆక్స్‌ఫర్డ్ గ్రే, అంగోరా బ్లూ, షిఫాన్ పింక్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ట్యాబ్‌కు చెందిన వైఫై వేరియెంట్ ధర రూ.27,999 ఉండగా, 4జీ ఎల్‌టీఈ వేరియెంట్ ధర రూ.31,999గా ఉంది. జూన్ 17 నుంచి ఈ ట్యాబ్‌ను విక్రయించనున్నారు. అమెజాన్‌లో ఈ ట్యాబ్‌కు ప్రీ బుకింగ్స్ సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రీబుకింగ్ చేసిన వారికి రూ.11,900 ధర కలిగిన శాంసంగ్ బడ్స్ ప్లస్ ఇయర్‌బడ్స్‌ను కేవలం రూ.2,999 కే అందిస్తారు. లేదా రూ.4,999 ధర కలిగిన గెలాక్సీ ట్యాబ్ ఎస్6 లైట్ బుక్ కవర్‌ను కేవలం రూ.2500కే అందిస్తారు.