నాగశౌర్యకు అంత సీన్ ఉందా..!

-

యువ హీరో నాగశౌర్య రకరకాల సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఛలోతో సూపర్ హిట్ అందుకున్న ఈ యువ హీరో ఈరోజు @నర్తనశాల సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీనివాస్ చక్రవర్తి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో యామిని భాస్కర్, కాశ్మీరా హీరోయిన్స్ గా నటించారు. సినిమాలో నాగశౌర్య గే పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే.

టీజర్, ట్రైలర్ లే ఈమధ్య సినిమా బిజినెస్ డిసైడ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో నాగశౌర్య నర్తనశాల సినిమా 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. ఛలో హిట్ ఎఫెక్ట్ ఈ సినిమాకు బాగా ఉపయోగపడింది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా ఫ్యాన్సీ ఎమౌంట్ కే కొనేశారని టాక్. అందుకే మీడియం బడ్జెట్ హీరో సినిమాకు ఈ రేంజ్ బిజినెస్ వచ్చింది. అయితే ప్రీమియర్ షో టాక్ మాత్రం సినిమా డిజప్పాయింట్ చేసిందని అంటున్నారు.

ఛలో తరహాలో సినిమా మొత్తం కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించినా కథ, కథనంలో బలం లేకపోవడం మైనస్ అయ్యిందని అంటున్నారు. మరి కంటెంట్ బాగా ఉంటేనే చూడటం కష్టం అనుకుంటున్న ఈ రోజుల్లో @నర్తనశాల నాగశౌర్యకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news