జబర్దస్త్ జడ్జిగా తనకంటూ ఒక ప్రత్యేక శైలిని అలవాటు చేసుకున్న నాగబాబు ఇకపై ఈ షోలో కనిపించరని కూడా వార్తలు వస్తున్నాయి. ఆయన స్థానంలో అలీ ఇక పర్మినెంట్‌గా జబర్దస్త్ షోలో జడ్జిగా ఉంటారట.
ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో వైకాపా ఇచ్చిన భారీ షాక్ కు ప్రత్యర్థి పార్టీలు ఇంకా తేరుకోలేదు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి నుంచి బయటకు రావడం లేదు. మరో వైపు జనసేన అధినేత పవన్ పరిస్థితి కూడా దాదాపు అదేవిధంగా ఉంది. ఇక ఆ పార్టీ తరఫున నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన నాగబాబు తీవ్ర విచారంలో ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఆయన ఇకపై ఈటీవీ జబర్దస్త్ షోకు జడ్జిగా రాకపోవచ్చని తెలుస్తోంది.
గత కొద్ది రోజులుగా ఈటీవీలో వస్తున్న రెండు జబర్దస్త్ షోలకు జడ్జిలు అనేక మంది మారారు. కొన్ని రోజులు మీనా, కొన్ని రోజులు సంఘవి.. వారితోపాటు డ్యాన్స్ మాస్టర్లు శేఖర్ మాస్టర్ , జానీ మాస్టర్ లు జబర్దస్త్ షోలలో జడ్జిలుగా సందడి చేశారు. అయినప్పటికీ వారి నవ్వు కృత్రిమంగా ఉందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారట. దీనికి తోడు గత కొద్ది రోజులుగా వస్తున్న జబర్దస్త్ షోలకు అస్సలు రేటింగ్‌లు ఉండడం లేదట. దీంతో వారి స్థానంలో ఈ సారి అలీని జడ్జిగా దింపారు. అలాగే ఎన్నికల అనంతరం రోజా కూడా కొంత కాలంగా జడ్జిగా కనిపిస్తోంది. కానీ ఆమె ఇకపై జడ్జిగా కొనసాగుతుందో, లేదో తెలియదు. దీంతో మరొక జడ్జి కోసం జబర్దస్త్ యాజమాన్యం చూస్తున్నట్లు తెలిసింది.
ఇక జబర్దస్త్ జడ్జిగా తనకంటూ ఒక ప్రత్యేక శైలిని అలవాటు చేసుకున్న నాగబాబు ఇకపై ఈ షోలో కనిపించరని కూడా వార్తలు వస్తున్నాయి. ఆయన స్థానంలో అలీ ఇక పర్మినెంట్‌గా జబర్దస్త్ షోలో జడ్జిగా ఉంటారట. అలాగే రోజా కొంత కాలం జడ్జిగా కొనసాగినా.. ఆమెకు మంత్రి పదవి లభిస్తే.. ఆమె కూడా జబర్దస్త్‌లో కనిపించే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి. మరి ఆమె జబర్దస్త్‌ను వీడిన పక్షంలో మరొక మహిళా జడ్జిని ఎవర్ని తీసుకువస్తారనే చర్చ సాగుతోంది. అయితే మీనా కొంత కాలం వరకు రోజా స్థానంలో కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆ తరువాత పర్మినెంట్‌గా ఓ ప్రముఖ నటిని జబర్దస్త్ జడ్జిగా కొనసాగిస్తారని తెలుస్తోంది. మరి.. నాగబాబు నిజంగానే జబర్దస్త్ నుంచి తప్పుకున్నారా, ఆలీతో పాటు మరొక కొత్త జడ్జి ఆ షోలో కనిపిస్తారా.. అన్న వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు..!