రూటు మార్చిన నాగార్జున‌.. ఈ సారైనా…

-

టాలీవుడ్ సీనియ‌ర్ అండ్ రొమాంటిక్ హీరో కింగ్ నాగార్జున ఇటీవ‌ల మన్మథుడు 2 అంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. అయితే నాగార్జున కెరీర్‌లో అత్యంత దారుణంగా డిజాస్టర్ అయిన ఈ చిత్రం పరాజయంతో పాటు నాగార్జునకు విమర్శలు కూడా భారీగానే తీసుకొచ్చింది. అసలు ఇలాంటి వయసులో అలాంటి సినిమా ఏంటి.. ఆ లిప్ లాక్ సన్నివేశాలేంటి అంటూ నాగార్జునపై విరుచుకుపడ్డారు విశ్లేషకులు. ఈ సినిమా తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకుని ఇప్పుడు యాక్షన్ డ్రామాతో వస్తున్నాడు మన్మథుడు.

అయితే సాల్మన్ దర్శకత్వంలో నాగ్ ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’ చిత్రం చేస్తున్నాడు. తాజాగా దీని మొదటి షెడ్యూల్ పూర్తయింది. ఇది యాక్షన్ ప్రధాన చిత్రమని నాగ్ లుక్ చూస్తేనే అర్థమవుతుంది. ‘వైల్డ్ డాగ్’ చిత్రంలో నాగ్ పాత్ర పేరు విజయ్ వర్మ. ఇది ఓ ఎన్ఐఏ అధికారి కథ. కావాల్సినంత యాక్షన్ మసాలా ఉంటుందనడంలో సందేహం అక్కర్లేదు. మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సారైనా నాగ్ హిట్ కొడ‌తాడో.. లేదో.. చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news