‘నా సామిరంగ’ హిట్.. ఇలాంటి సినిమాలే చేయాలని నాగ్ ఇంట్లోకి చీటీలు విసిరిన ఫ్యాన్స్

-

టాలీవుడ్ మన్మథుడు, కింగ్.. అక్కినేని నాగార్జున కొత్త చిత్రం ‘నా సామిరంగ’ ఆదివారం (జనవరి 14)న రిలీజైన విషయం తెలిసిందే. అయితే ఈ సంక్రాంతి బరిలో లేటుగా వచ్చిన ఈ మన్మథుడు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాడు. సంక్రాంతి ఫైట్లో నాగార్జున మరోసారి సక్సెస్ అందుకున్నాడు. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో ఈవినింగ్, నైట్ షోస్కు బుకింగ్స్ జోరందుకున్నాయి.

ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ హైదరాబాద్లో థాంక్యూ మీట్ నిర్వహించింది. ఈ మీట్లో హీరో నాగార్జున, అల్లరి నరేశ్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ‘నా సామిరంగ’ ఫలితం తనకెంతో సంతోషాన్నిచ్చిందని చెప్పాడు. తమను ఆదరించిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు థాంక్యూ చెప్పారు. ఈ సినిమాతో తన ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారని.. వాళ్ల ఆనందాన్ని చూస్తుంటే తనకు తృప్తిగా ఉందని తెలిపాడు. పొద్దున్నుంచి ఫ్యాన్స్ అందరు కంగ్రాట్స్ అని చీటీలపై రాసి ఇంట్లో పడేస్తున్నారని చెప్పుకొచ్చాడు. ఇలాంటి సినిమాలే తీయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారన్న నాగ్.. అక్కినేని అభిమానులందికీ మరోసారి ధన్యవాదాలు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news