యాపిల్ ప్రొడక్ట్స్ కొనేప్పుడు జాగ్రత్త.. నాగార్జున సంచలన ట్వీట్

-

యాపిల్ ప్రొడక్ట్స్ అంటే అందరికీ అదో రకమైన క్రేజ్. డబ్బున్న వారు ఎక్కువగా తమ స్టేటస్ చూపించుకోవడానికి ఈ కంపెనీ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. ఈ ప్రొడక్ట్స్ కి పెద్దగా సమస్యలు రావు, ఒక వేళ వస్తే ఒక పట్టాన వదలవు. సామాన్యులకి ఏమైనా ఇబ్బంది కలిగితే ఆ స్టోర్ ల చుట్టూ కళ్ళు అరిగేలా తిరగడం తప్ప ఏమీ చేయలేరు. కానీ ఇదే సమస్య టాలీవుడ్ కింగ్ నాగార్జునకు రావడంతో ఆయన ఈ సంస్థ పాలసీలను, సర్వీస్ లను తూర్పారబడుతూ ట్వీట్ చేశారు.

యాపిల్ స్టోర్స్ లో ఏదైనా యాప్ లు పెట్టుకునే అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వాళ్ల సర్వీసులు, పాలసీలు వాళ్లకు అనుకూలంగా వన్ సైడ్ గానే ఉంటాయి అవి కూడా దారుణంగా ఉంటాయి అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక పక్కన కొంతమంది ఆయన సమర్థిస్తూ ఉంటే మరికొందరు మాత్రం మేడిన్ ఇండియా ప్రొడక్ట్స్ వాడకుండా ఇలాంటివి వాడితే ఇలాగే ఉంటుంది అన్నట్టు కామెంట్ చేస్తున్నారు. మరికొందరేమో మీరు ట్వీట్ చేసింది కూడా ఐ ఫోన్ నుంచే కదా అన్నట్లు కామెడీగా నాగ్ ను ట్రోల్ చేస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news