బిగ్ బాస్ 3 ప్రోమో షూట్‌లో నాగార్జున.. పిక్ వైరల్

529

కంటెస్టెంట్ల సెలెక్షన్ కూడా అయిపోయిందని.. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 3 స్టార్ట్ అవనున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే ప్రోమో కూడా రిలీజ్ చేస్తారట. బిగ్ బాస్ 3 కంటెస్టెంట్లు వీళ్లేనని.. సోషల్ మీడియాలో ఆ లిస్ట్ కూడా వైరల్ అయింది.

నిజమేనన్నమాట. ఇప్పటి వరకు బిగ్ బాస్ 3లో నాగార్జునను హోస్ట్‌గా తీసుకుంటున్నారని వార్తలు వచ్చినప్పటికీ.. అధికారికంగా మాత్రం బిగ్ బాస్ నిర్వాహకులు నాగార్జుననే హోస్ట్‌గా తీసుకున్నామని ప్రకటించలేదు. కానీ.. ఇప్పుడు కన్ఫమ్ అయిపోయింది. నాగార్జునే బిగ్ బాస్ 3 హోస్ట్. ఆయన ఇటీవలే బిగ్ బాస్ 3 ప్రోమో షూట్‌లో పాల్గొన్నారు. ఆయన షూట్‌లో పాల్గొన్న దానికి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే బిగ్ బాస్ 3 ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

కంటెస్టెంట్ల సెలెక్షన్ కూడా అయిపోయిందని.. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 3 స్టార్ట్ అవనున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే ప్రోమో కూడా రిలీజ్ చేస్తారట. బిగ్ బాస్ 3 కంటెస్టెంట్లు వీళ్లేనని.. సోషల్ మీడియాలో ఆ లిస్ట్ కూడా వైరల్ అయింది. అయితే.. అందులో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు.. ఎంతమంది కాలేదు.. అనే విషయం తెలియాలంటే మాత్రం బిగ్ బాస్ నిర్వాహకులు చెప్పేదాకా వెయిట్ చేయాల్సిందే.