రోజాకు బంపర్ ఆఫర్.. మరో కీలక పదవి అప్పగించనున్న సీఎం జగన్?

-

నవరత్నాల హామీల అమలు కోసం సపరేట్‌గా ఒకరిని నియమించి…వాళ్లకు నవరత్నాల బాధ్యతలు అప్పగిస్తే బెటర్ అని.. అలా అయితే.. వాటి అమలు పక్కాగా జరుగుతుందని సీఎం అనుకుంటున్నారట.

ఏపీ సీఎం జగన్.. అందరు ముఖ్యమంత్రుల్లా కాకుండా కాస్త డిఫరెంట్‌గా ఏపీని పాలిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 15 రోజుల్లోనే ఏపీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. వెంటనే 25 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. అయితే.. మంత్రివర్గంలో చోటు దక్కని కొందరు నేతలు సీఎంపై అలిగారు. వాళ్లలో నగరి ఎమ్మెల్యే రోజా ఒకరు. ఆమెకు మంత్రి పదవి ఖచ్చితంగా వస్తుంది అని అంతా అనుకున్నారు. కానీ.. ఆమెకు జగన్ మంత్రి పదవి ఇవ్వలేదు.

దీంతో ఆమె అలగడంతో ఆమెకు ఏపీఐఐసీ చైర్మన్ బాధ్యతలను అప్పగించారు. దీంతో రోజా కాస్త శాంతించారు. ఆమె అసలే ఫైర్ బ్రాండ్. అసెంబ్లీలోనూ ప్రతిపక్షనేతలపై విమర్శల వర్షం కురిపించే సత్తా ఉన్న నేత. అందుకే.. ఆమెకు మరో పదవి కట్టబెట్టాలని జగన్ యోచిస్తున్నారట.

వైసీపీ అధికారంలోకి రావడానికి కీలక బాధ్యత పోషించింది నవరత్నాల హామీలే. అయితే.. నవరత్నాల హామీలను నెరవేర్చేందుకు సీఎం జగన్.. పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. నవరత్నాల హామీల అమలు కోసం సపరేట్‌గా ఒకరిని నియమించి…వాళ్లకు నవరత్నాల బాధ్యతలు అప్పగిస్తే బెటర్ అని.. అలా అయితే.. వాటి అమలు పక్కాగా జరుగుతుందని సీఎం అనుకుంటున్నారట. అందుకే.. వాటి అమలుకు సంబంధించిన కీలక బాధ్యతలను రోజాకు అప్పగించాలని సీఎం భావిస్తున్నారట. నవరత్నాల అమలును కూడా మంత్రులను అప్పజెప్పితే.. వాళ్లకు పనిభారం పెరుగుతుందని.. అందుకే… మంత్రివర్గంలో చోటు దక్కని నేతలకు అది అప్పగిస్తే.. వాళ్లు దాన్ని పర్‌ఫెక్ట్‌గా చేస్తారని జగన్ అనుకుంటున్నట్టు సమాచారం.

అందుకే.. దానిపై ప్రత్యేక కమిషన్ వేసి రోజాను ఆ కమిషన్‌కు చైర్మన్‌గా… సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీని అందులో సభ్యురాలిగా చేర్చాలని సీఎం భావిస్తున్నారట. మంత్రి కాకపోయినా రెండు కీలక పదవులను రోజా దక్కించుకుందని.. మంత్రి పదవి కంటే కూడా అవి పెద్ద బాధ్యతలని.. అందుకే రోజాకు జగన్ మంత్రి పదవి ఇవ్వలేదంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news