నాగార్జున మన్మథుడు 2 టీజర్.. నువ్వింకా వర్జినే కదా?

564

నాగ్ మళ్లీ తన విశ్వరూపాన్ని చూపించాడనిపిస్తుంది. ఐదు పదుల వయసు వచ్చినప్పటికీ నాగ్‌కు ఇంకా పెళ్లి కాలేదని అందరూ టీజ్ చేస్తుంటారు. నువ్వింకా వర్జినే కదా.. అని నాగార్జున తల్లి అడగడం.. అవును.. అని నాగార్జున తలూపడం లాంటి సీన్లు ఆద్యంతం ఆకట్టుకుంటాయి.

ఏజ్ పెరుగుతున్నా కొద్దీ యువకుడిలా మారుతున్నాడు కింగ్ నాగార్జు. ఐదు పదుల వయసులోనూ ఆయనకు ఉన్న లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆయన్ను టాలీవుడ్ మన్మథుడు అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం నాగ్ నటిస్తున్న మూవీ మన్మథుడు 2. మన్మథుడు సినిమాకు కొనసాగింపుగా వస్తోంది ఈ సినిమా. ఈసినిమాకు సంబంధించి టీజర్‌ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది.

ఇక.. టీజర్ విషయానికి వస్తే.. నాగ్ మళ్లీ తన విశ్వరూపాన్ని చూపించాడనిపిస్తుంది. ఐదు పదుల వయసు వచ్చినప్పటికీ నాగ్‌కు ఇంకా పెళ్లి కాలేదని అందరూ టీజ్ చేస్తుంటారు. నువ్వింకా వర్జినే కదా.. అని నాగార్జున తల్లి అడగడం.. అవును.. అని నాగార్జున తలూపడం లాంటి సీన్లు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. నాగార్జునను ఉద్దేశించి వచ్చే డైలాగ్స్ మాత్రం కేక. ఐ డోంట్ ఫాల్ ఇన్ లవ్, ఓన్లీ మేకింగ్ లవ్ అంటూ చివర్లో నాగ్ డైలాగ్ చెప్పడంతో టీజర్ ముగుస్తుంది.

మన్మథుడు 2 లో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా.. సమంత అతిథి పాత్రలో మెరవనున్నారు. వెన్నెల కిషోర్, లక్ష్మీ, రావు రమేశ్, ఝాన్సీ, దేవ దర్శిని, నిశాంతి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు 9న ఈ సినిమా రిలీజ్ కానుంది.