బీజేపీ తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఇతర పార్టీల నేతలను బీజేపీలోకి లాక్కోవడానికి తెగ ప్రయత్నిస్తోంది. బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ హైదరాబాద్‌లో మకాం వేసి.. అన్ని పార్టీల నేతలతో చర్చిస్తున్నారు. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్‌తో కూడా చర్చించారట.
కాంగ్రెస్ పార్టీ.. జాతీయ స్థాయిలోనే దాన్ని దేకేవాళ్లు లేరు. ఇక తెలంగాణలో ఎవరు పట్టించుకుంటారు. అందుకే.. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటే.. కాంగ్రెస్ పార్టీలో పదవులు ఉంటే ఎంత లేకుంటే ఎంత.. అని అనుకున్నారో ఏమో.. ఇటీవల ఎంపీలుగా గెలిచిన రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీజేపీలోకి జంప్ అవడానికి ప్లాన్ అంతా సిద్ధం చేసుకున్నారట. ఇక వెంకట్‌రెడ్డి ఎక్కడుంటే తన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి కూడా అక్కడే ఉంటారు కదా.. అందుకే.. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ బీజేపీలోకి జంప్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారట.
మరోవైపు బీజేపీ తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఇతర పార్టీల నేతలను బీజేపీలోకి లాక్కోవడానికి తెగ ప్రయత్నిస్తోంది. బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ హైదరాబాద్‌లో మకాం వేసి.. అన్ని పార్టీల నేతలతో చర్చిస్తున్నారు. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్‌తో కూడా చర్చించారట. వాళ్లు కూడా బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారట. వాళ్లే కాదు.. మాజీ ఎంపీ వివేక్, మరికొందరు కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారట. వీళ్లంతా బీజేపీలో చేరితే తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటో ఊహించుకోవడానికే భయంగా ఉంది కదా.