బర్త్ డే స్పెషల్.. నాగార్జున కొత్త సినిమా టైటిల్ రిలీజ్

-

అక్కినేని హీరో నాగార్జున పుట్టిన రోజు ఇవాళ. సోషల్ మీడియా మొత్తం హ్యాపీ బర్త్ డే నాగ్ అంటూ హోరెత్తిపోతోంది. సినీ ప్రముఖుల నుంచి అభిమానుల వరకు అందరూ నెట్టింట నాగ్​కు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. అయితే గత కొంతకాలం నుంచి నాగార్జున కొత్త సినిమా ఊసే లేదు. మొదట్లో రైటర్ ప్రసన్నకు డైరెక్షన్ ఆఫర్ ఇచ్చి అతడి దర్శకత్వంలో సినిమా చేస్తారనే టాక్ వినిపించింది. కానీ ఎట్టకేలకు నాగ్ మరో కొత్త డైరెక్టర్​తో తన సినిమా ప్రకటించేశాడు.

తాజాగా నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా ప్రకటించారు. ‘నా సామిరంగ’ అనే టైటిల్​ను ఖరారు చేస్తూ.. మూవీ ఫస్ట్ లుక్​ టైటిల్ గ్లింప్స్​ను రిలీజ్ చేశారు. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం పవర్​ఫుల్​గా ఉంది. నాగార్జున స్టైల్​గా బీడీ కాల్చుకోవడం, లుంగీ మాస్​ లుక్​ అదిరింది. ‘జాతర జాతర’ అంటూ వచ్చే బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్ అదిరింది. ‘ఈ సారి పండక్కి నా సామిరంగ.. కింగ్ మాస్ జాతర మొదలు..’ అంటూ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో పోటీగా దిగబోతున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news