నాగార్జునని ఒప్పించడం కష్టమే..!

-

ఈమధ్య కాస్త జోరు తగ్గిస్తున్నట్టు కనిపిస్తున్న కింగ్ నాగార్జున ప్రస్తుతం మన్మధుడు-2 త్వరలోనే సెట్స్ మీదకు తీసుకళ్లబోతున్నాడు. చిలసౌ డైరక్టర్ రాహుల్ రవింద్రన్ డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి కాగా త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఇక ఈ సినిమాతో పాటుగా బంగార్రాజు సినిమాను చేసే ఆలోచనలో ఉన్నాడు నాగార్జున.

ఇక ఇదే కాకుండా ఓంకార్ డైరక్షన్ లో రాజు గారి గది-3 సినిమాలో కూడా నాగార్జున నటిస్తారని వార్తలు వస్తున్నాయి. ఓంకార్ డైరక్షన్ లో వచ్చిన రాజు గారి గది హిట్ అయ్యింది. అయితే ఆ తర్వాత వచ్చిన రాజు గాది గది-2 వర్క్ అవుట్ కాలేదు. నాగార్జున, సమంత లాంటి స్టార్స్ అందులో నటించినా లాభం లేకుండా పోయింది. ఇక ఇప్పుడు ఓంకార్ రాజు గారి గది-3 స్క్రిప్ట్ సిద్ధం చేశాడట. ఈ సీక్వల్ లో కూడా నాగ్ ని పెడదామని అనుకుంటున్నాడట.

నాగ్ మాత్రం రాజు గాది గది-3లో చేసే ఆలోచన అసలు లేదన్నట్టు చెబుతున్నాడట. రాగు గారి గది-2 హిట్టైతే పరిస్థితి ఎలా ఉండేదో కాని ఫెయిల్ అయ్యింది కాబట్టి రాజు గాది గది-3 చేయనని చెబుతున్నాడట. మరి నాగార్జునని ఒప్పించి చేస్తాడో లేక వేరే హీరోతో అడ్జెస్ట్ అవుతాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news