యువకుడి ప్రాణం తీసిన ప‌బ్‌జీ గేమ్..!

డియర్ యూత్.. మీరు కూడా పబ్ జీ గేమ్ కు బానిసలా? కాస్త ఆలోచించండి.. రూపాయి ఫైదా లేని ఆ పనికిమాలిన గేమ్ ఆడి ప్రాణాల మీదికి తెచ్చుకోవడం ఎంత వరకు కరెక్టో మీరో ఆలోచించుకోండి…

ప‌బ్‌జీ.. ఈ గేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా యూత్. యూత్ ఏం ఖర్మ.. స్కూల్ కు వెళ్లే పిల్లలు కూడా ఈ గేమ్ బానిస అయ్యారు. ఇప్పుడు ఎవరిని చూసినా ప‌బ్‌జీ గేమ్ ఆడుతూ ఈలోకాన్ని మైమరిచిపోయేవాళ్లే.

అయితే.. ప‌బ్‌జీ గేమ్ చాలా డేంజర్ అని.. పిల్లల్లో హింసా ప్రవృత్తిని కలిగిస్తుందని.. ఆ గేమ్ ఆడొద్దంటూ చాలామంది సలహాలు కూడా ఇస్తున్నారు. కానీ.. అవి యూత్ చెవిన పడతాయా? వాళ్లు ఎవ్వరి మాటలనూ ఖాతరు చేయకుండా ప‌బ్‌జీ లోకంలో తేలిపోతున్నారు.

అయితే.. ఈ ప‌బ్‌జీ గేమ్ ఓ యువకుడిని బలి తీసుకున్నది. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలోని రాజారాంపల్లికి చెందిన 20 ఏళ్ల సాగర్ ప‌బ్‌జీ గేమ్ పిచ్చితో ప్రాణాలు కోల్పోయాడు. సాగర్.. ఏదో టైమ్ పాస్ కు గేమ్ ను ఆడటం ప్రారంభించాడు. తర్వతర్వాత దానాకి బానిస అయిపోయాడు సాగర్. గత 45 రోజులుగా ఈ గేమ్ ను కంటిన్యూస్ గా ఆడాడట సాగర్. దీంతో అతడి మెడనరాలు పట్టేశాయి. ఆరోగ్యం క్షీణించింది. కుటుంబ సభ్యులు వెంటనే సాగర్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చి ట్రీట్ మెంట్ ఇప్పించారు.

గత ఐదు రోజులుగా సాగర్ కు వైద్యులు ట్రీట్ మెంట్ చేసినప్పటికీ… సాగర్ నరాలు పూర్తిగా దెబ్బ తినడంతో సాగర్ మృతి చెందాడు. చూశారా.. టైమ్ పాస్ కోసం ఆడిన ప‌బ్‌జీ ఎలా ప్రాణాలు తీసేసిందో.