అటు ఇటు తిరిగి టబు దగ్గర ఆగారు..!

-

త్రివిక్రం డైరక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా తెర్కెక్కనున్న సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. నా పేరు సూర్య తర్వాత బన్ని చాలా కథలు విన్న తర్వాత ఓకే చేసిన సబ్జెక్ట్ ఇది. ఆల్రెడీ త్రివిక్రం, బన్ని కలిసి జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు చేశారు. ఆ రెండు హిట్ సినిమాలు కాగా ఈసారి హ్యాట్రిక్ హిట్ కోసం చూస్తున్నారు. ఇక ఈ సినిమా కూడా ఫాదర్ సెంటిమెంట్ తో వస్తుందని తెలుతుండగా సినిమాలో బన్ని తల్లి పాత్రలో అందాల తార టబు నటిస్తుందని తెలుస్తుంది.

తెలుగులో టాప్ హీరోయిన్ గా చెలామణి అయిన టబు ఆ తర్వాత బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే కొన్నాళ్లుగా తెలుగు తెరకు దూరంగా ఉన్న టబు ఇక్కడ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. తెలుగులో ఆమె ఇప్పుడు మదర్ రోల్స్ కు ప్రమోట్ అయ్యింది. త్రివిక్రం, బన్ని కాంబోలో వస్తున్న సినిమాకు ఆమెను తల్లి పాత్రకు అడిగారట. నగ్మా, నదియా కాదని చెప్పిన ఆ రోల్ కు టబు ఓకే చేసిందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news