నాగార్జున గెస్ట్ గా బిగ్ బాస్ ఫైనల్స్

-

నాని హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ ఫైనల్స్ కు దగ్గరైంది. ప్రస్తుతం హౌజ్ లో ఏడుగురు సభ్యులు ఉండగా వచ్చే వారం మరో ఇద్దరు హౌజ్ నుండి ఎలిమినేట్ అవుతారు. ఇక ఉన్న ఆ ఐదుగురిలో ఫైనల్ విన్నర్ తేలనుంది. మొదట కాస్త బోర్ కొట్టించిన బిగ్ బాస్ సెకండ్ సీజన్ ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. ఇంటి సభ్యులు ఒకరి మీద ఒకరి ఎత్తులు పై ఎత్తులు ప్రేక్షకుల్లో ఎక్సైట్మెంట్ కలిగేలా చేస్తున్నాయి.

ఇక బిగ్ బాస్-2 ఫైనల్స్ కు మరింత కిక్ ఇచ్చేందుకు ఈసారి ఓ సర్ ప్రైజ్ గెస్ట్ ను ఇన్వైట్ చేస్తున్నారట. అతనెవరో కాదు మన కింగ్ నాగార్జున స్పెషల్ గెస్ట్ గా బిగ్ బాస్ లో మెరుస్తున్నాడట. దేవదాస్ ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ కు నాగార్జున వస్తున్నాడట. అంతేకాదు ఫైనల్ విన్నర్ ను కూడా నాగ్ ఎనౌన్స్ చేస్తాడని అంటున్నారు. నాగ్, నానిల మల్టీస్టారర్ గా దేవదాస్ భారీ అంచనాలతో రానుంది.

బిగ్ బాస్ 2 ఫైనల్ రేసులో కౌశల్, గీతా మాధురి, తనీష్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సామ్రాట్, రోల్ రైడాలు కూడా ఫైనల్స్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version