ప్రస్తుతం కథా చర్చలు నడుస్తున్నాయట. తెలుగు, తమిళ భాషల్లో భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా నిర్మిస్తారని తెలుస్తుంది. రామ్, దుల్కర్ ఇద్దరు యువ హీరోలు కలిసి చేసే ఈ మల్టీస్టారర్ చాలా స్పెషల్ గా ఉంటుందని మాత్రం చెప్పొచ్చు. మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు దుల్కర్ సల్మాన్ మరి రామ్ తో మల్టీస్టారర్ లో ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో చూడాలి.
యువ హీరోలంతా వరుస విజయాలతో దూసుకెళ్తుంటే రామ్ మాత్రం కాస్త వెనుకపడ్డాడు. స్రవంతి రవికిశోర్ సపోర్ట్ ఉన్నా సరే రామ్ కెరియర్ ఎందుకో సక్సెస్ ట్రాక్ లో నడవట్లేదు. మల్టీస్టారర్ సినిమా కూడా స్రవంతి మూవీస్ బ్యానర్ లోనే తెరకెక్కుతుందని తెలుస్తుంది.