గత కొంతకాలంగా అక్కినేని నాగార్జునకు సరైన హిట్ దక్కడం లేదు. ఒకప్పుడు వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ అటు మాస్ ఆడియన్స్‌ని ఇటు క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ కింగ్ కొంతకాలంగా ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించడంలో ఫెయిల్ అవుతున్నాడు. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో కింగ్ నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలై అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ కథానాయికగా నటించింది.
ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదలయ్యేందుకు సిద్ధమయ్యింది. ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.. నవంబర్ 2న ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. సోషల్ మీడియా వేదికగా ఇవాళ ఈ విషయాన్ని ప్రకటించింది నెట్‌ఫ్లిక్స్. నవంబర్ 2న ఈ మూవీ తమ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని తెలిపింది. ‘ది ఘోస్ట్’ సినిమా ట్రైలర్ షేర్ చేస్తూ.. ‘భయపెట్టే కథల్లో ఉండే ఘోస్ట్ కాదు.. నవంబర్ 2న నెట్ ఫ్లిక్స్ లోకి వస్తుంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
Bhayapette kathallo unde ghost kaadhu, prapaanchaanni vanikinche oka yuddhame vasthundhi. The Ghost, streaming from Nov 2 on Netflix. pic.twitter.com/pKqktxka8l
— Netflix India South (@Netflix_INSouth) November 1, 2022