తెలంగాణ బీజేపీ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. టీఎన్జీవోలను టార్గెట్ చేస్తూ.. అడుగులు వేస్తోంది.టిఎన్జిఓ లపై కేంద్ర ఎన్నికల సంఘానికి బిజెపి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు టీఎన్జీవోలపై తెలంగాణ బిజెపి ఇన్చార్జ్ తరుణ్ చుగ్ కంప్లైంట్ ఇచ్చారు.
టిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. టిఎన్జీవోలు, బిజెపి నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులపై బిజెపి చీఫ్ బండి సంజయ్ కామెంట్స్ పై టీఎన్జీవోలు మీడియా సమావేశం నిర్వహించి, ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి పార్టీలకు మద్దతుగా మాట్లాడుతున్నారని టీఎన్జీవోలపై తరుణ్ చుగ్ తీవ్ర ఆరోపణలు చేశారు.