బిగ్‌బాస్‌ షో ఓ వ్యభిచార గృహం..సీపీఐ నారయణ సంచలనం

-

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ షాకింగ్‌ కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ షో అనేది లైసెన్స్ వ్యభిచారం లాంటిదని.. ఇది అనైతికం…అక్కడ యువతీ, యువకుల్ని పెట్టి బ్రోతల్ హౌస్ నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. నేను ఫిర్యాదు చేసిన తర్వాత.. లైవ్ కెమెరాలు పెడుతున్నారని.. కెమెరాలు కంటపడకుండా ఏమైనా చేయచ్చు కదా అని నిలదీశారు.

నాగార్జున లాంటి ప్రముఖులు ఇలాంటి షోలకు యాంకర్ గా వెళ్తారా…! అన్నమయ్య, రామదాసు లాంటి సినిమాలు చేసిన వ్యక్తి ఇది చేస్తారని నిప్పులు చెరిగారు. నాగార్జునకు డబ్బులు లేవా.. కొంచమైనా నైతికతా ఉందా..! బిగ్ బాస్ షోపై సోషియల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నామన్నారు. క్లీన్ ఎంటర్ టైన్మెంట్ పేరుతో యాప్ విడుదల చేస్తున్నామని… గతంలో కోకోకోలా యాడ్ నుంచి చిరంజీవి కూడా తప్పుకున్నారని ఆగ్రహించారు.

సినిమా టికెట్ల ధరలు తగ్గించడమన్నది సరైన చర్యేనని.. కానీ చిరంజీవి, కొందరు వ్యక్తులను మాత్రమే పిలిచి మాట్లాడారని తెలిపారు. సినీ అసోషియేషన్లతో మాట్లాడి ఉంటే అసలు సమస్య వచ్చి ఉండేది కాదని.. ఎవర్నో దెబ్బ కొట్టాలని కళారంగాన్ని దెబ్బతీసే విధంగా జగన్ వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news