నమ్రత షేర్ చేసిన షార్ట్ ఫిల్మ్.. అదిరిపోయే రెస్పాన్స్

-

సూపర్ స్టార్ మహేష్ భార్య నమ్రత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. సినిమాలకు సంబందించిన అప్డేట్స్ తో పాటుగా ఆమెకు నచ్చిన ప్రతి విషయాన్ని తన ట్విట్టర్, ఇన్ స్టాగ్రాం హ్యాండిలింగ్స్ లో షేర్ చేస్తుంటారు నమ్రత. అలానే షీ అంటూ ఓ షార్ట్ ఫిల్మ్ ను తన ఇన్ స్టాగ్రాంలో షేర్ చేశారు నమ్రత మహేష్.

సమాజంలో మహిళకు ఎదురయ్యే లైంగిక వేధింపుల మీద కేవలం 3 నిమిషాల్లోనే బాగా అర్ధమయ్యేలా చెప్పారు. ఈ షార్ట్ ఫిల్మ్ నమ్రత షేర్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అయ్యిందని చెప్పొచ్చు. అమ్మాయిలా తయారైన ఓ అబ్బాయి బయటకు వెళ్లగా అతనికి ఎదురైన అనుభవాలతో షీ షార్ట్ ఫిల్మ్ రూపొందించారు.

ఈ షార్ట్ ఫిల్మ్ ను MARD అఫిషియల్ గా రిలీజ్ చేశారు. రంజీత్ కౌర్ డైరెక్ట్ చేసిన ఈ షార్ట్ ఫిల్మ్ ను ఫర్హాన్ అక్తర్, ఫిరోజ్ అబ్బాస్ ఖాన్, పాపులేషన్ ఇండియా వారు సంయుక్తంగా ఈ షార్ట్ ఫిల్మ్ నిర్మించారు. మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

Read more RELATED
Recommended to you

Latest news