తెలంగాణలో ఎన్నికల ప్రచారం రోజురోజుకు వేడెక్కుతోంది. ఇప్పటికే వాయువేగంతో రోజుకు కనీసం 9 సభలను నిర్వహిస్తున్న కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. దీంతో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న రాజకీయ పక్షాలు తన రాజకీయ ‘పెద్దలను’ రంగంలోకి దించుతున్నాయి. ఇందులో భాగంగానే మేడ్చల్‌లో కాంగ్రెస్ సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో బహిరంగ సభను నిర్వహించారు. అదే బాటను నేటినుంచి భాజపా అనుసరించనుంది. దీంతో భాజపా తరుఫున ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్రానికి రాబోతున్నారు.
నిజామాబాద్‌లో మధ్యాహ్నం 12 గంటలకు, మహబూబ్‌నగర్‌లో మధ్యాహ్నం 2:30 గంటలకు జరిగే బహిరంగ సభల్లో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. ప్రధాని సభల కోసం భాజపా భారీగా జనసమీకరణ చేస్తోంది. డిసెంబరు 3న హైదరాబాద్‌లో జరగనున్నసభలోనూ మోడీ పాల్గొననున్నారు. తెరస ప్రభుత్వం, కాంగ్రెస్, తెదేపా వైఖరీలపై నేడు ప్రధాని ప్రధానంగా ఆరోపణలు చేయనున్నట్లు తెలుస్తోంది.