గొప్ప మనసు: శభాష్ బాలయ్య… నువ్వు సూపరయ్యా!

-

సాధారణంగా రాజకీయాల్లో ఉన్నవారు ఏ చిన్న పని చేసినా… అందులో పొలిటికల్ క్రెడిట్ కోసం వెంపర్లాడుతుంటారని అంటుంటారు. అది సహజం కూడా! ఈ క్రమంలో ఆయా నేతలు చేసే సహాయ కార్యక్రమాలు చిన్నవైనా పెద్దవైనా వాటికి పార్టీ జెండా కట్టేసి, ప్రకటనలు గుప్పించేస్తుంటారు.. పెయిడ్ ఆర్టికల్స్ రాయించేస్తుంటారు. కానీ… ఈ విషయంలో బాలయ్య మాత్రం అలా కాదని అంటున్నాయి తాజా సంఘటనలు!

రాజకీయాలు రాజకీయాలే.. సినిమా సినిమానే.. వ్యక్తిగత జీవితం వ్యక్తిగత జీవితమే అన్నట్లుగా సాగిపోతుంటుంది నందమూరి బాలకృష్ణ పద్దతి! ఇది అంత సులువు కాదు! ఒక్కసారి రాజకీయాల్లోకి వచ్చిన అనంతరం ఏ చిన్న సాయం చేసినా దానికి ఒక ఫ్లెక్సీ, అనంతరం పార్టీ జెండా.. అధినేతకు క్రెడిట్లో భాగం! ఈ క్రమంలో… తాజాగా బాలయ్య, సినిమా ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్‌ లోని అందరికీ ముందు జాగ్రత్త చర్యలుగా కరోనా నిరోధానికి సంబంధించిన హోమియో పిల్స్, విటమిన్ టాబ్లెట్స్‌ ను బసవతారకం హాస్పిటల్ ద్వారా పంపించారు.

ఇది సినిమా నటుడిగా, సీనియర్ హీరోగా, వన్ ఆఫ్ ది పిల్లర్ ఫ్యామిలీ మెంబర్ గా ఆయన బాధ్యత అనుకోవచ్చు. ఎప్పుడంటే… ఆయన కేవలం హీరోగా ఉన్నప్పుడు! కానీ… ఆయన తండ్రి స్థాపించిన ఒక పార్టీ ఉండి.. అందులో ఆయన ఎమ్మెల్యేగా ఉండి కూడా… ఆ సహాయ కార్యక్రమానికి రాజకీయ రంగు అంటనీయకుండా బాలయ్య ప్రవర్తించడం నిజంగా అభినందనీయమని అంటున్నారు సినీ జనాలు!

పావలా సాయం చేసి రూపాయి ప్రకటనలు ఇచ్చుకునే ఈ రోజుల్లో… బాలయ్య ఈ సహాయ కార్యక్రమాల్లో పసుపు రంగుకానీ, సైకిల్ గుర్తు కానీ లేకుండా చేయడం అనేది నిజంగా గ్రేటే!! బాలయ్యా… నువ్వు సూపరయ్యా!!

Read more RELATED
Recommended to you

Latest news