అందుకే బాలయ్య అంతటి సాహసానికి సిద్దమయ్యాడా?

-

నందమూరి బాలకృష్ణ పేరు వింటే మాస్ రెస్పాన్స్ అదిరిపోతుంది. ఆయన కనిపించినా, డైలాగ్‌లు చెప్పినా, స్టెప్పులు వేసినా థియేటర్ దద్దరిల్లిపోవాల్సిందే. నందమూరి నటసింహం బాలయ్య సినిమా అంటే ఎప్పటికీ ఓ క్రేజ్ ఉంటూనే వస్తుంది. మధ్యలో ఎన్ని పరాజయాలు ఎదురైనా సరే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కుర్ర హీరోలకు పోటీగా దూకుడును ప్రదర్శిస్తున్నాడు.

బాలయ్య చివరగా రూలర్ అనే చిత్రంతో పలకరించాడు. కేఎస్ రవికుమార్ దర్వకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవి చూసింది. అన్నింటి కంటే ముఖ్యంగా బాలయ్య లుక్స్, విగ్స్‌పై లెక్కలేనన్ని సెటైర్స్, మీమ్స్ హల్చల్ చేశాయి. ఆ సినిమాకు ఆయన లుక్కే పెద్ద మైనస్ అయిందని కామెంట్స్ వచ్చాయి.

అందుకు బోయపాటి శీను సినిమాకు బాలయ్యను నాచురల్‌గా చూపించాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. విగ్ లేకుండా బయటకు వచ్చే బాలయ్య గత కొన్ని రోజులుగా గుండుతో కనిపిస్తున్నాడు. అయితే బాలయ్యను ఇలా నాచురల్‌గా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అనవసరపు విగ్స్ ధరించి విమర్శలపాలయ్యే బదులు ఇలా ఒరిజినల్‌గా బాగుంటుందని ఫిక్స్ అయినట్ట తెలుస్తోంది.

అందుకే ఈ మధ్య ఎక్కడికి వెళ్లినా నార్మల్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. తాజాగా బాలయ్య పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిలో బాలయ్యను చూస్తే అదిరిపోయేలా ఉన్నాడన్న కామెంట్స్ వస్తున్నాయి. ఏది ఏమైనా సహజంగా ఉండటమే ఓ అందం అన్నది బాలయ్యకు తెలిసి వచ్చిందేమో.

 

Read more RELATED
Recommended to you

Latest news