తారక్ మీద నమ్మకం పోయిందా..?

-

నందమూరి హీరోలలో బాలకృష్ణ కంటే తారక్ కు ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే నమ్మాల్సిందే. నందమూరి చర్మిష్మాని కొనసాగించిన బాలయ్య అన్నా నందమూరి అభిమానుల్లో విపరీతమైన గౌరవం అయితే ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ విలక్షణ నటుడిగా ఎన్.టి.ఆర్ విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఎన్.టి.ఆర్ చెప్పిన మాటని తూచా తప్పకుండా పాటించే నందమూరి ఫ్యాన్స్ ఇప్పుడు ఆయన మాటలను పట్టించుకోవడం మానేశారు.

ఈమధ్య వచ్చిన ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా నిరాశపరచడం నందమూరి హీరోలు డీలా పడ్డారు. తాము ఏం చేసినా.. ఎలా చేసినా సరే ఫ్యాన్స్ ఉన్నారన్న ధైర్యంతో ముందుకెళ్లే నందమూరి హీరోలు బయోపిక్ రిజల్ట్ తో షాక్ అయ్యారు. ఇక కళ్యాణ్ రాం హీరోగా వస్తున్న 118 సినిమా విషయంలో ఆ సినిమా హీరోతో పాటుగా బాలయ్య, ఎన్.టి.ఆర్ వచ్చి ప్రమోట్ చేసినా పెద్దగా లాభం లేకుండా పోతుంది.

సినిమా మీద పూర్తి నమ్మకంగా ఉన్నాం అని చెప్పిన తారక్ మాటలను కూడా పక్కన పెట్టారు నందమూరి ఫ్యాన్స్. అందుకే మార్చి 1న రిలీజ్ అవుతున్న ఈ సినిమా టికెట్స్ ఆన్ లైన్ లో పెట్టినా పెద్దగా బుకింగ్స్ జరగడం లేదు. అంతేకాదు ప్రీ రిలీజ్ బజ్ కూడా పెద్దగా కనిపించడం లేదని తెలుస్తుంది. మరి అన్నకి సపోర్ట్ గా ఎన్.టి.ఆర్ ఉంటున్నా ఫ్యాన్స్ మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. దీనికి కారణాలు ఇదవరకు కళ్యాణ్ రాం సినిమాల ఫలితాలే కావొచ్చు. మరి రిలీజ్ తర్వాత మంచి టాక్ వచ్చినా నందమూరి ఫ్యాన్స్ హంగామా షురూ అవుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news