అభినందన్ లానే 20 ఏళ్ల క్రితం పాకిస్తాన్ కు చిక్కిన పైలెట్..!

-

భాతర వాయుసేన చేసిన దాడిలో అంతా సవ్యంగా సాగిందని అనుకుంటున్న టైంలో మన వాయుసేన పైలెట్ అభినందన్ పాక్ మిలటరీకి చిక్కినట్టు తెలిసిందే. భారతీయులంతా అభినందన్ మళ్లీ స్వదేశానికి తిరిగి రావాలని కోరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం అభినందన్ పాకిస్తాన్ కు చిక్కినట్టుగానే 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో నచికేత పాకిస్తాన్ కు చిక్కాడు.

కార్గిల్ యుద్ధం జరుగుతుండగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లెఫ్టినెట్ కె నచికేత యుద్ధ విమానం పైలెట్ గా వ్యవహించాడు. అయితే విమానంలో గస్తీకి వెళ్లిన ఆయన కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల విమానం కూలిపోతుందని గుర్తించి ప్యారచ్యూట్ తో కిందకు దిగాడు. అయితే అది పాకిస్తాన్ సరిహద్ధు ప్రాంతం అవడంతో అక్కడ మిలిటరీ వాళ్లు నచికేతని బంధించారు.

భారత మిలిటరీ రహస్యాలను చెప్పాలని చిత్ర హింసలు పెట్టినా అతను ఏమాత్రం నోరు విప్పలేదు. నచికేతను విడిపించేందుకు ఇస్లామాబాద్‌లో భారత హై కమిషనర్‌గా ఉన్న పార్థసారథి ఎంతగానో కృషి చేశారు. నాటి ప్రభుత్వం చొరవతో ఎనిమిది రోజుల తర్వాత నచికేతను పాకితాన్ విడిచిపెట్టింది. నచికేతను విడిపించేందుకు ఇస్లమాబాద్ లో అప్పటి భారత్ హై కమీషనర్ పార్థసారథి కష్టపడ్డారు. అప్పటి రాష్ట్రపతి కే.ఆర్ నారాయణన్, ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయ్ నచికేతను హీరో అంటూ అభినందించారు. అంతేకాదు వాయుసేన పథకంతో గౌరవించింది. ప్రస్తుతం అభినందన్ కూడ పాక్ మిలిటరీ ఆదీనంలో ఉన్నాడు. అతను కూడా నచికేత లానే తిరిగి రావాలని ఆశిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news