కౌశల్ తో గొడవ నందిని అవుట్..!

-

బిగ్ బాస్ నుండి ఈ వారం అందరు అనుకుంటున్నట్టుగానే నందిని రాయ్ ఎలిమినేట్ అయ్యింది. కౌశల్, బాబు గోగినేని, దీప్తి, గణేష్, నందినిలలో శనివారం కౌశల్, బాబులను ప్రొటెక్ట్ చేసిన నాని ఆదివారం గణేష్, దీప్తిలను సేఫ్ చేసి నందినిని ఇంటి నుండి బయటకు పంపించాడు. కొన్నివారాలుగా కౌశల్ తో గొడవపడిన హౌజ్ మెట్స్ ఎలిమినేట్ అవుతుండటం చర్చగా మారుతుంది.

భాను శ్రీ, తేజశ్వి లేటెస్ట్ గా నందిని ఇలా ముగ్గురు కౌశల్ ను టార్గెట్ చేయడంతో బయట కౌశల్ కు సపోర్ట్ గా ఉన్న కౌశల్ ఆర్మీకి అగైనెస్ట్ గా మారారు. అందుకే వారికి ఓట్లు వేయట్లేదు. అంతేకాదు వారిపై నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారట. కౌశల్ తో గొడవే వీరి ఎలిమినేషన్ కు దారితీసిందని అంటున్నారు. ఆ మాటల్లో ఎంతవరకు నిజం ఉంది అన్నది తెలియాల్సి ఉంది.

లాస్ట్ వీక్ పూజా హౌజ్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. మరోపక్క శ్యామలా, నూతన్ నాయుడులు కూడా హౌజ్ లోకి వచ్చేశారు. మొత్తానికి కౌశల్ ఆర్మె బయట సపోర్ట్ గా ఉన్నా ఇప్పుడు కౌశల్ కు హౌజ్ లో కూడా సపోర్టర్స్ పెరిగారనే చెప్పొచ్చు. ఫైనల్ విన్నర్ అయ్యే లక్షణాలు కౌశల్ కే ఉన్నాయన్నది కూడా అందరు అంటున్నమాట.

Read more RELATED
Recommended to you

Latest news