పాత ద‌ర్శ‌కుడితోనే మ‌ళ్లీ సెట్స్ పైకి వెళ్ల‌నున్న నాని..

-

న్యాచుర‌ల్ స్టార్ నాని కథానాయకుడిగా ఆ మధ్య వచ్చిన ‘నిన్నుకోరి’ ఆయనకి విజయాన్ని తెచ్చిపెట్టింది. నాని, ఆది పినిశెట్టి, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించగా, డివివి దానయ్య నిర్మించారు. అయితే దర్శకుడిగా శివ నిర్వాణకి కూడా మంచి పేరు తీసుకువ‌చ్చింది. ఆ తరువాత చైతూ హీరోగా శివ నిర్వాణ తెరకెక్కించిన ‘మజ్ను’ కూడా సక్సెస్ ను సాధించింది. ఈ నేపథ్యంలో మళ్లీ నాని – శివ నిర్వాణ కాంబినేషన్లో మరో సినిమా రూపొందనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమాను రేపు లాంచ్ చేయనున్నట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. ఇంతవరకూ అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇటు విజయ్ దేవరకొండకి కూడా శివ నిర్వాణ ఒక కథను వినిపించాడు .. ఆ కథ కూడా ఓకే అయింది. అయితే విజయ్ దేవరకొండ వరుస కమిట్మెంట్స్ తో ఉన్నాడు. అందువల్ల‌ ముందుగా నానితో చేయడానికి శివ నిర్వాణ సిద్ధమవుతున్నాడని చెబుతున్నారు. ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news