నాని ‘వ్యూహం’లో సమంత..!

-

నాచురల్ స్టార్ నాని ఈ నెల 19న జెర్సీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నాని క్రికెటర్ గా కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత నాని మరోసారి ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాలో నాని నెగటివ్ రోల్ చేస్తాడని వార్తలు వస్తున్నాయి. సుధీర్ బాబు కూడా ఈ సినిమాలో నిర్మిస్తాడని తెలిసిందే.

ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నాయట. సినిమాకు టైటిల్ గా వ్యూహం అని ఫిక్స్ చేశారట. నాని, సమంత కలిసి ఈగ, ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాలో నటించారు. ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ జంట కలిసి నటిస్తుంది. పెళ్లి తర్వాత సమంత వరుస సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం తమిళంలో సూపర్ డీలక్స్ ఆల్రెడీ రిలీజ్ అవగా.. తెలుగులో మజిలీతో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news