నాని టక్ జగదీష్ లో హైలెట్స్ ఇవే..?

నాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న సినిమా టక్ జగదీష్. షైన్ స్క్రీన్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాలో నాని సరసన రీతు వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఏప్రిల్ 23న రిలీజ్ అవుతున్న ఈ సినిమా టీజర్, సాంగ్స్ ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచాయి. ఇక ఈ సినిమాలో హైలెట్ సీన్స్ ఏంటన్నది తెలిసిపోయింది. ఈమధ్యనే జరిగిన ఈవెంట్ లో డైరక్టర్ శివ నిర్వాణ తన జీవితంలో ఇలాంటి ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ తీస్తానో లేనో అని అన్ని ఎమోషన్స్ ఈ సినిమాలో చూపించానని అన్నాడు.

Nani Tuck Jagadish Highlight Scenes

సినిమాలో జగపతి బాబు, నానిల మధ్య ఒక సెంటిమెంట్ సీన్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. అంతేకదు సినిమాలో యాక్షన్ పార్ట్ కూడా కొత్తగా ఉంటుందని తెలుస్తుంది. నాని రెగ్యులర్ సినిమాల ఫైట్స్ లా కాకుండా టక్ జగదీష్ లో ఫైట్స్ క్రేజీగా ఉంటాయని చెబుతున్నారు. మొత్తానికి టక్ జగదీష్ సూపర్ బజ్ ఏర్పడగా సినిమా అంచనాలను అందుకుంటే మాత్రం నాని ఖాతాలో మరో సూపర్ హిట్ పడినట్టే లెక్క.