ఎండాకాలంలో వేడి తీవ్రత రోజురోజుకీ ఎక్కువౌతోంది. ఏప్రిల్ నెల ప్రారంభం కావడంతో ఎండలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ తమ ఇళ్లు, ఆఫీసు కార్యాలయాల్లో ఏసీలు (ఎయిర్ కండీషనర్) తెచ్చుకునేందుకు ఇష్టపడతారు. అయితే మీరు ఏసీలు కొనుగోలు చేయడానికి వెళ్లినప్పుడు సేల్స్ ఎగ్జిక్యూటివ్‌తో అనేక రకాల ప్రశ్నలు అడుగుతారు. ఏ బ్రాండ్‌కు చెందిన ఏసీ బాగుంటుందని, విండో ఏసీ బాగుంటుందా.. స్లిప్ట్ ఏసీ బాగుటుందా.. ఎంత బడ్జెట్ దొరుకుంది అనే ప్రశ్నలు మదిలో మెదులుతాయి. అయితే ఇక్కడ మీకు సేల్స్ మెన్ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. ‘ మీరు ఎంత టన్ను ఏసీ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. 1 టన్నా, 1.5 టన్నా, లేదా 2 టన్నులా.’ అని అడుగుతాడు. అయితే టన్ను అనే పదం వినగానే చాలా మంది వినియోగదారులు అవాక్కవుతారు. ఏసీల బరువు టన్నుల్లో వస్తుందా అని భ్రమపడతారు.
సాధారణంగా టన్ను అంటే..
బరువును కొలవడానికి టన్ను ప్రమాణం. ఉదాహరణకు గ్రాములు, కిలోలు, క్వింటాళ్లు ఎలాగో టన్ను కూడా అలాంటిదే. 1 కిలోను 1000 గ్రాములు అంటారు. అదే 100 కిలోలకు 1 క్వింటాల్ అంటారు. అలాగే ఒక టన్ను అంటే 10 క్వింటాల్స్ అని అర్థం.
ఏసీలో టన్ను అంటే..
సేల్స్‌మెన్ మిమ్మల్నీ ఎన్ని టన్నుల ఏసీ తీసుకుంటారని అడిగినప్పుడు.. అది టన్ను బరువున్న ఏసీ వస్తుందని అర్థం కాదు. ఏసీలో టన్ను అంటే అది ఇచ్చే చల్లదనమని అర్థం. గది వెడల్పును బట్టి టన్నుల్లో విడదీస్తారు. మీ రూమ్ విస్తీర్ణం 10/10 ఉన్నట్లయితే (100 చదరపు అడుగుల విస్తీర్ణం) 1 టన్ను ఏసీ సరిపోతుంది. అదే 100 చదరపు అడుగుల విస్తీర్ణం కంటే ఎక్కువగా ఉంటే 1.5 టన్నుల ఏసీ తీసుకోవాలి. 200 టన్నులకు మించి విస్తీర్ణం ఉంటే 3 టన్నుల ఏసీ తీసుకుంటే రూమ్ టెంపరేచర్ చల్లగా ఉంటుంది. విస్తీర్ణాన్ని బట్టి అంత టన్నుల ఏసీని కొనుగోలు చేస్తేనే బాగుంటుంది. విస్తీర్ణం తక్కువగా ఉండి.. ఎక్కువ టన్నుల ఏసీ తీసుకుంటే చలి తీవ్రత ఎక్కువ ఉండటంతోపాటు విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయి.