నిన్న నటుడు నరేష్.. మాజీ భార్య రమ్య రఘుపతి పై పోలీసు కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఘటనపై స్వయంగా నటుడు నరేష్ స్పందించారు. రమ్య వసూళ్లపై తనకు ఎలాంటి సంబంధం లేదని నరేష్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. 9 ఏళ్ల క్రితం వివాహం జరిగిందని.. 5 ఏళ్ల క్రితం విడిపోయామని చెప్పారు నరేష్.
రమ్య, నేను కొన్నాళ్లుగా విడి విడిగా.. ఉంటున్నామని నరేస్ వివరించారు. ఇద్దరం ఒకే క్యాంపస్ లో ఉన్నప్పటికీ.. ఆరేళ్లుగా దూరంగా ఉంటున్నామని స్పష్టం చేశారు. రమ్య వసూళ్ల పై ఇప్పటికే చాలా మంది ఫిర్యాదు చేస్తున్నారని నరేష్ వెల్లడించారు.
డబ్బులు ఇవ్వద్దని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు గతంలోనే చెప్పామని నరేష్ అన్నారు. గతంలో కూడా డబ్బులు ఇవ్వొద్దని చాలా మందికి చెప్పామన్నారు నరేష్. ఇక ముందు కూడా ఎవరూ కూడా తన మాజీ భార్య రమ్య రఘుపతి మాటలు నమ్మకూడదని కోరారు నరేష్. తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు నరేష్.