‘టక్ జగదీశ్’ గా సరికొత్త అవతారమెత్తిన ‘నాని’…..!!

-

నాచురల్ స్టార్ నాని కొద్దిరోజుల క్రితం నటించిన ఎమోషనల్ డ్రామా జెర్సీ  మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నటించిన గ్యాంగ్ లీడర్ మాత్రం ఆశించిన రేంజ్ లో విజయాన్ని అందుకోలేదు. ఆ తరువాత సుధీర్ బాబుతో కలిసి ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వి అనే మూవీలో ఒక డిఫరెంట్ రోల్ లో నటిస్తున్న నాని, నేడు తన నూతన సినేమాను అనౌన్స్ చేయడం జరిగింది. తనతో కలిసి ‘నిన్ను కోరి’ సినిమాను తెరకెక్కించిన శివ నిర్వాణకు మరొక్కసారి ఈ సినిమా ద్వారా అవకాశాన్ని కల్పించారు నాని.
ఇక ఇటీవల నాగచైతన్య మరియు సమంతలతో కలిసి శివ తీసిన మజిలీ సినిమా మంచి హిట్ కొట్టిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం తెరకెక్కనున్న ఈ టక్ జగదీశ్ కూడా శివ గత రెండు సినిమాల మాదిరిగా మంచి ఎమోషన్ తో పాటు ఎంటర్టైన్మెంట్ గా కూడా సాగనున్నట్లు సమాచారం. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
ప్రసాద్ మురెళ్ళ ఫోటోగ్రఫిని అందిస్తున్న ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్, ఇతర నటీనటులు ఎంపిక దాదాపుగా పూర్తి అయిందని, అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోయే ఈ సినిమాను మే లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఆకట్టుకునే కథ, కథనాలతో పాటు ప్రేక్షకుల హృదయాలను తాకే మంచి అంశాన్ని తన సినిమా కథలు గా ఎంచుకునే  శివ నిర్వాణ, ఈ సినిమా కోసం కూడా ఒక అద్భుతమైన కథను రెడీ చేసినట్లు సమాచారం. మరి గ్యాంగ్ లీడర్ తో కొంత ఢీలాపడ్డ నానికి ఈ సినిమా ఎంత మేర సక్సెస్ ని అందిస్తుందో చూడాలి….!!

Read more RELATED
Recommended to you

Latest news