తనను కూడా కమిట్మెంట్ అడిగారంటున్న నయనతార..!!

-

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఏ రేంజ్ లో ఉందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ముఖ్యంగా స్టార్ హీరోయిన్లను మొదలుకొని ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త హీరోయిన్ల వరకు ప్రతి ఒక్కరు కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితులే అని చెప్పడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే చాలామంది ఇండస్ట్రీలో అవకాశాలు రావాలి అంటే క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కోవాల్సిందే అనే వార్తలు కూడా ఎప్పటికప్పుడు వినిపిస్తూ ఉంటాయి. అందులో కొంతమంది క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొని ఇండస్ట్రీలో కొనసాగితే మరికొంతమంది భయపడి ఇండస్ట్రీని వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు.

ఈ క్రమంలోనే సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా క్యాస్టింగ్ కౌచ్ సమస్యలను ఎదుర్కొన్నాను అంటూ మీడియా ముందు వెల్లడించింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నయనతార ఇండస్ట్రీలో ఉన్నటువంటి క్యాస్టింగ్ కౌచ్ గురించి నోరు విప్పింది. ముఖ్యంగా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది లేదు అనే విషయం గురించి తాను మాట్లాడనని. అయితే మన ప్రవర్తన బట్టి మనకు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయని ఆమె తెలియజేసింది. ఇకపోతే తాను ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో తనని కూడా చాలామంది కమిట్మెంట్ అడిగారని అయితే తనకు ఇష్టం లేదని నిర్మొహమాటంగా చెప్పినట్లు నయనతార వెల్లడించింది.

నయనతార మాట్లాడుతూ.. నేను నా టాలెంట్ ను మాత్రమే నమ్ముకొని ఇండస్ట్రీలోకి వచ్చాను. టాలెంట్ తోనే ప్రస్తుతం ఈ స్థాయికి చేరుకున్నాను.. అందుకే ఎటువంటి క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదురైనా ధైర్యంగా నిలబడగలిగాను అంటూ క్యాస్టింగ్ కౌచ్ సమస్యపై నోరు విప్పింది. మొత్తానికైతే నయనతార చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news